తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆన్​లైన్ లావాదేవీలపై పరిమితులు నేటి నుంచే అమలు - వ్యాపార వార్తలు

మీకు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులున్నాయా? వాటితో మీరు ఆన్‌లైన్‌లో ఏమైనా లావాదేవీలు చేస్తున్నారా? మార్చి 16 నుంచి అది కుదరకపోవచ్చు! ఎందుకంటే డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డులను మరింత సురక్షితంగా మార్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) పటిష్ఠ చర్యలు చేపట్టింది. అనుచితంగా కార్డులను వాడటం, బ్యాంకింగ్‌ మోసాలను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకులకు కొన్ని నిబంధనలను జారీ చేసింది.

online transaction restrictions from today
ఆన్​లైన్​ లావదేవీలపై ఆంక్షలు నేటి నుంచే అమలు

By

Published : Mar 16, 2020, 4:19 AM IST

డెబిట్​, క్రెడిట్ కార్డు వినియోగంపై పరిమితులు విధించింది భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ). అనుచిత కార్డుల వాడకం, బ్యాంకింగ్ మోసాలను అడ్డుకొనేందుకు అన్ని బ్యాంకులను కొన్ని నిబంధనలను జారీ చేసింది.

ఈ నిబంధనల ప్రకారం నేటి నుంచి మీ కార్డులతో కేవలం స్థానిక (డొమెస్టిక్‌) లావాదేవీలు చేసేందుకు మాత్రమే వీలుంది. అంటే ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) టెర్మినల్స్‌లో మాత్రమే వాడుకోవచ్చు. ఇకపై జారీ చేసే కొత్త కార్డులు, కాల పరిమితి ముగిసిన కార్డులను రెన్యువల్‌ చేసుకున్నప్పుడు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. అయినప్పటికీ వినియోగదారుడు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలు చేయాలనుకుంటే బ్యాంకు నుంచి అనుమతి పొందాల్సిందే.

ఇప్పటి వరకు వాడనివి..

ఆర్బీఐ నిబంధనల ప్రకారం నష్టభయాన్ని బేరీజు వేసుకొని ప్రస్తుతం ఉన్న కార్డుల్లో ఆన్‌లైన్‌, అంతర్జాతీయ లావాదేవీలను డీయాక్టివేట్‌ చేసే అధికారం బ్యాంకులకు ఉంది. ఇంతకు ముందు తీసుకున్న కార్డుల ద్వారా ఇప్పటి వరకు ఆన్‌లైన్‌, అంతర్జాతీయ, కాంటాక్ట్‌లెస్‌ లావాదేవీలు చేయకపోయినా బ్యాంకులు ఆ సదుపాయాలను డీయాక్టివేట్‌ చేస్తాయి.

ఏటీఎంల ద్వారా..

ఇకపై వినియోగదారులు తమ కార్డులను సంబంధిత ఏటీఎంల ద్వారా స్విచ్‌ ఆఫ్/ఆన్‌ చేసుకొనే సౌకర్యం కల్పిస్తున్నాయి. ఎటువంటి లావాదేవీలు చేయనప్పుడు ఈ సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటికే భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్​బీఐ) చాలామంది వినియోగదారులకు కొన్ని సదుపాయాలను డిసేబుల్‌ చేశామని.. అవసరమైతే తమకు తెలియజేయాలని సందేశాలు పంపించింది.

ఇదీ చూడండి:ఉద్యోగులు పీఎఫ్​ ఎప్పుడెప్పుడు విత్​డ్రా చేసుకోవచ్చంటే!

ABOUT THE AUTHOR

...view details