తెలంగాణ

telangana

ETV Bharat / business

కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ - MPC

RBI keeps benchmark interest rate unchanged
ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

By

Published : Feb 6, 2020, 11:57 AM IST

Updated : Feb 29, 2020, 9:32 AM IST

12:31 February 06

ఆర్​బీఐ కీలక వడ్డీరేట్లు యథాతథం

ఆర్​బీఐ మధ్యంతర ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 5.15 శాతం మార్చలేదు. ఇలా చేయడం ఇది రెండోసారి. అయితే వృద్ధిని పునరుద్ధరించడానికి అవసరమైన విధాన వైఖరి కొనసాగిస్తామని ఆర్​బీఐ స్పష్టం చేసింది.

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆర్​బీఐ చేపట్టిన చివరి సమీక్ష ఇదే. అయితే 2019-20లో 5 శాతంగా ఉన్న జీడీపీ వృద్ధిరేటు... 2020-21లో 6 శాతానికి చేరుకోవచ్చని ఆర్​బీఐ అంచనా వేసింది.

"ఆర్థిక కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల పెరిగిన కొన్ని సూచికలు ఇంకా విస్తృత ఆధారిత పద్ధతిలో పుంజుకోలేదు. ద్రవ్యోల్బణ పరిస్థితులు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం సముచితమైమని ఎంపీసీ భావించింది."-ద్రవ్యవిధాన కమిటీ (ఎంపీసీ)

ఆరుగురు సభ్యుల కమిటీ కీలక వడ్డీరేట్లు విషయంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. అయితే భవిష్యత్​లో ఈ రేట్లు తగ్గించే అవకాశముందని సూచించింది. 2019 ఫిబ్రవరి- అక్టోబర్ మధ్య ఆర్​బీఐ రెపోరేటును 135 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 
  

     
 

11:53 February 06

కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ

పరపతి విధాన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. రెపో, రివర్స్‌ రెపో రేటులో మార్పులేదని ఆర్‌బీఐ తెలిపింది.

Last Updated : Feb 29, 2020, 9:32 AM IST

ABOUT THE AUTHOR

...view details