కీలక వడ్డీ రేట్లను.. రిజర్వు బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) ఈ సారి యథాతథంగా ఉంచేందుకు మొగ్గు చూపింది. దీనితో రెపోరేటు 4 శాతం వద్ద, రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా వద్ద కొనసాగనున్నాయి.
వృద్ధికి ఊతమందించేందుకు వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచేందుకే ఎంపీసీ సభ్యులు మొగ్గు చూపినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వెల్లడించారు. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.25 శాతం వద్ద ఉంటుందని పేర్కొన్నారు. వృద్ధి కోసం భవిష్యత్లో మరిన్ని కీలక నిర్ణయాలు ఉంటాయని తెలిపారు.