ఐసీఐసీఐ బ్యాంక్‌కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జరిమాన విధించింది. వ్యవస్థాగతంగా కొన్ని మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు రూ.3 కోట్ల జరిమానా విధించినట్లు ఆర్బీఐ తెలిపింది.
2015, జూలై 1 నాటి బ్యాంకుల వర్గీకరణకు సంబంధించిన మూల్యాంకణ ప్రకారం ఆర్బీఐ జారీ చేసిన కొన్ని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఐసీఐసీఐ బ్యాంక్ వ్యవహరించిందని.. ఈ కారణంగా జరిమానా విధించినట్లు ఓ ప్రకటలో తెలిపింది.