భారతీయ స్టేట్ బ్యాంకుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.కోటి జరిమానా(RBI impose fine on SBI) విధించింది. 2018 మార్చి 31, 2019 మార్చి 31న ఆర్థిక అంశాలకు సంబంధించి ఎస్‌బీఐ సూపర్‌వైజరీ ఎవాల్యుయేషన్ (ఐఎస్‌ఈ) చట్టబద్ధ తనిఖీలు చేపట్టిందని, నష్ట మదింపు నివేదికల్లో కొన్ని నిబంధనలు పాటించనందుకు ఎస్‌బీఐకి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. బ్యాంక్ ఇచ్చిన సమాధానం, ఇతర వివరాలను పరిశీలనలోకి తీసుకుని జరిమానా(RBI impose penalty on SBI) విధించింది
SBI news: ఎస్‌బీఐకి ఆర్‌బీఐ షాక్- రూ.కోటి జరిమానా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు(ఎస్‌బీఐ)(RBI penalty SBI) రూ.కోటి జరిమానా విధించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ). నియంత్రణపరమైన నిబంధనలు ఉల్లంఘించినందుకే ఈ జరిమానా విధించినట్టు ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఎస్‌బీఐ
ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా రుణగ్రహీత కంపెనీల్లో ఎస్‌బీఐకి షేర్లున్నట్లు గుర్తించి.. ఈమేరకు జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం కింద 1949లోని సెక్షన్ 19(2) ప్రకారం ఆర్‌బీఐ ఈ చర్య తీసుకుంది.19(2) ప్రకారం.. ఏ బ్యాంకింగ్ సంస్థ అయినా ఏ కంపెనీలోనైనా వాటాలను, తనఖాగా లేదా సంపూర్ణ యజమానిగా చెల్లించిన షేర్ క్యాపిటల్లో 30 శాతం కంటే ఎక్కువ మొత్తాన్ని కలిగి ఉండకూడదు.
ఇదీ చూడండి:Tomato Price: 'టమాట ధర... మరో రెండు నెలల పాటు తగ్గేదేలే'