తెలంగాణ

telangana

ETV Bharat / business

వడ్డీరేట్లే కాదు మా దగ్గర మరిన్ని అస్త్రాలున్నాయి: దాస్​ - ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​

ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ కీలక వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడంపై విభిన్నంగా స్పందించారు. మందగమనాన్ని పరిష్కరించేందుకు తమ వద్ద మరిన్ని అస్త్రాలు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

RBI has many other tools to revive growth: Das
వడ్డీరేట్లే కాదు మా దగ్గర మరిన్ని అస్త్రాలున్నాయి: దాస్​

By

Published : Feb 6, 2020, 1:14 PM IST

Updated : Feb 29, 2020, 9:42 AM IST

కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంపై ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంతదాస్​ విభిన్నంగా స్పందించారు. మందగమనాన్ని పరిష్కరించడానికి ఆర్​బీఐ దగ్గర వడ్డీరేట్లు మాత్రమే కాకుండా, అనేక ఇతర మార్గాలూ ఉన్నాయని పేర్కొన్నారు.

ఆర్​బీఐ తన ఆరో ద్రవ్య పరపతి విధాన సమీక్షలో... 2020-21లో దేశ జీడీపీ వృద్ధిరేటు 6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందని, దీర్ఘకాలంలో అనిశ్చిత ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశముందని పేర్కొంది.

జాతీయ గణాంక కార్యాలయం (ఎన్​ఎస్​ఓ) జనవరి 31న విడుదల చేసిన అంచనాల్లో... వాస్తవ జీడీపీ వృద్ధిని 2019 మేలో అంచనా వేసిన 6.8 శాతం నుంచి 6.1 శాతానికి సవరించింది. ఆర్థికవ్యవస్థలోని ఉత్పత్తి-డిమాండ్​కు మధ్య అంతరాలున్న నేపథ్యమే ఇందుకు కారణం.

యథాతథం...

ఆర్​బీఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటు (5.15 శాతం)ను మార్చలేదు. అయితే వృద్ధి పునరుద్ధరణకు కృషిచేస్తామని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వడ్డీరేట్లు తగ్గించే అవకాశం ఉందని సూచించింది.

ఇదీ చూడండి: కీలక వడ్డీరేట్లు యథాతథం: ఆర్‌బీఐ

Last Updated : Feb 29, 2020, 9:42 AM IST

ABOUT THE AUTHOR

...view details