కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైనట్లు చెప్పారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఈ నేపథ్యంలోనే రెపోరేటు 4.40 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. రివర్స్ రెపోరేటును 3.35 శాతానికి పరిమితం చేశారు.
ఆర్బీఐ కీలక నిర్ణయం- రెపోరేటు 4 శాతానికి తగ్గింపు - rbi latest updates
కరోనా సంక్షోభం నేపథ్యంలో రెపోరేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. రివర్స్ రెపోరేటును 3.35 శాతానికి పరిమితం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడుదొడుకుల్లో ఉన్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.
రెపోరేటు 4శాతానికి, రివర్స్ రెపో రేటు 3.2శాతానికి తగ్గింపు
సిమెంటు ఉత్పత్తి 25 శాతం తగ్గిందని, ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసిందని మీడియా సమావేశంలో వెల్లడించారు శక్తికాంత దాస్. పెట్టుబడుల ప్రవాహం గణనీయంగా ప్రభావితమైందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరిగిందన్నారు.