బ్యాంకులకు మెరుగైన రుణాలు అందించే సదుపాయాన్ని భారతీయ రిజర్వు బ్యాంకు ఆరు నెలలు పొడిగించింది. 2021 మార్చి 31 వరకు ద్రవ్య కొరతను తీర్చడానికి ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది మార్చి 27న జరిగిన మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) పథకం కింద షెడ్యూల్ చేసిన బ్యాంకుల రుణ పరిమితిని 2 నుంచి 3 శాతానికి పెంచింది. దీనికి తొలుత జూన్ 30 వరకు గడువు విధించింది. అనంతరం సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ప్రస్తుతం మరోసారి పెంచింది ఆర్బీఐ.