తెలంగాణ

telangana

ETV Bharat / business

'డిసెంబరుకు డిజిటల్‌ కరెన్సీ నమూనా' - భారతీయ రిజర్వ్ బ్యాంకు

డిజిటల్‌ కరెన్సీ కార్యకలాపాల నమూనాను ఈ ఏడాది చివరి కల్లా వెల్లడించనుంది భారతీయ రిజర్వ్ బ్యాంకు. ఈ మేరకు ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవిశంకర్‌ తెలిపారు.

digital currency
డిజిటల్‌ కరెన్సీ

By

Published : Aug 7, 2021, 6:02 AM IST

డిజిటల్‌ కరెన్సీని తీసుకువచ్చే విషయంలో రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) మరో అడుగు వేసింది. డిజిటల్‌ కరెన్సీ కార్యకలాపాల నమూనాను ఈ ఏడాది చివరకు వెల్లడించగలమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌ టి రవిశంకర్‌ తెలిపారు. ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల వెల్లడి సందర్భంగా శుక్రవారం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేయడం కోసం కీలక రేట్లను యథాతథంగా రికార్డు కనిష్ఠాల్లోనే ఉంచాలని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ఏకగ్రీవంగా నిర్ణయించింది. కరోనా పరిణామాల ప్రభావాన్ని తగ్గించడానికి ఇప్పటిదాకా ఆర్‌బీఐ 100కు పైగా చర్యలను తీసుకుందని ఈ సందర్భంగా పేర్కొంది.

ఇదీ చూడండి:వడ్డీ రేట్లు యథాతథం- ఆర్​బీఐ సమీక్ష హైలైట్స్​ ఇవే...

ABOUT THE AUTHOR

...view details