Ratan Tata Welcomes Air India Passengers: దాదాపు 69 ఏళ్ల తర్వాత విమానయాన సంస్థ ఎయిరిండియా తిరిగి పుట్టినింటికి చేరుకుంది. గతవారం కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. ఈ సంస్థ టాటా గ్రూప్‌నకు బదిలీ అయిన తర్వాత టాటా సన్స్ గౌరవ ఛైర్మన్, టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తొలిసారిగా స్పందించారు. ఎయిరిండియా ప్రయాణికులకు సాదర స్వాగతమంటూ ప్రత్యేక ఆడియో మెసేజ్ పంపారు.
'ఎయిరిండియా నూతన ప్రయాణికులకు టాటా గ్రూప్ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. ప్రయాణికుల సౌకర్యం, సేవల పరంగా విమానయానం అంటే ఎయిరిండియానే అనేలా సంస్థను తీర్చిదిద్దేలా పని చేసేందుకు సంతోషంగా ఉన్నాం' అని టాటా ప్రయాణికులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ప్రత్యేక ఆడియో సందేశాన్ని ఎయిరిండియా ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.