ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై స్పందించిన టాటా.. ఆ ప్రచారాన్ని ఆపాలంటూ నెటిజన్లను కోరారు. అవార్డుల కంటే దేశానికి సేవ చేసే అవకాశం రావడమే తాను అదృష్టంగా భావిస్తానని అన్నారు. అసలేం జరిగిందంటే..
డాక్టర్ వివేక్ భింద్రా అనే ఓ మోటివేషనల్ స్పీకర్ శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో రతన్ టాటా గురించి ఓ ట్వీట్ చేశారు. పారిశ్రామిక రంగంలో ఆయన చేసిన సేవలకు గానూ టాటాకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని.. అందుకోసం తమ #BharatRatnaForRatanTata ప్రచారంలో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ హ్యాష్‌ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయ్యింది. రతన్‌టాటా భారత రత్నకు అర్హులంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్లు చేస్తున్నారు.
అదే నాకు గర్వకారణం..