Rakesh Jhunjhunwala record profit: వరుస నష్టాలతో భారీగా కుదేలైన స్టాక్ మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. వివిధ రంగాల షేర్లు కోలుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇండియా బిగ్బుల్ రాకేశ్ ఝున్ ఝున్వాలాపై కాసులు వర్షం కురిసింది. కేవలం పది నిమిషాల వ్యవధిలోనే తాను పెట్టుబడి పెట్టిన రెండు కంపెనీల షేర్లు అమాంతం పెరిగాయి. దీంతో ఏకంగా రూ. 186 కోట్లు వచ్చి పడ్డాయి. ఆ రెండు కంపెనీలూ.. టాటా గ్రూప్‌నకు చెందినవి కావడం విశేషం. వాటిలో ఒకటి టాటా మోటార్స్ కాగా.. మరొకటి టైటాన్.
సోమవారం ఎన్ఎస్ఈ సెషన్ క్లోజింగ్ నాటికి రూ.2,398 ఉన్న టైటాన్ షేర్ విలువ మార్కెట్ ఓపెనింగ్ సెషన్లో రూ. 23.95 పెరిగి.. రూ.2,435 లకు చేరింది. ఇదే విధంగా టాటా మోటార్స్ షేర్ కూడా రూ. 4.70 పెరిగి రూ.476.15కి చేరింది. దీంతో కేవలం పదే నిమిషాల్లో రూ. 186 కోట్ల ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో వచ్చి చేరాయి.