ప్రముఖ పెట్టుబడిదారుడు రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారం అవుతోంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్‌లో ఆయన తాజాగా కోటి షేర్లు కొనుగోలు చేశారు. బీఎస్ఈ డేటా ప్రకారం.. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్‌లో.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వాటా 2.17 శాతానికి పెరిగింది.
కోటి షేర్ల కొనుగోలు వార్తలతో.. ఎన్ఎస్ఈలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ షేరు విలువ 3.42 శాతం (రూ.9.10) పెరిగి.. రూ.275.30 వద్దకు చేరింది. ఈ కంపెనీ షేరు ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పుంజుకుకోవడం గమనార్హం.
కంపెనీ వివరాలు..
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫినాన్స్ లిమిటెడ్ దేశంలో ప్రధాన హోంలోన్ కంపెనీల్లో ఒకటి. ఇది ఇండియా బుల్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ. చౌక వడ్డీ రేట్లకే రుణాలు ఇచ్చే సంస్థగానూ దీనికి గుర్తింపు ఉంది.