తెలంగాణ

telangana

ETV Bharat / business

క్యూ1 ఫలితాలు, ఫెడ్ వడ్డీ రేట్లే మార్కెట్లకు కీలకం! - స్టాక్ మార్కెట్ వార్తలు తెలుగు

కార్పొరేట్ల త్రైమాసిక క్యూ1 ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. వీటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ వార్తలు మార్కెట్లకు సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

Stocks Expectations for this week
ఈ వారం స్టాక్​ మార్కెట్ అంచనాలు

By

Published : Jul 25, 2021, 3:12 PM IST

కంపెనీల త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లకు కీలకం కానున్నాయి. జులై డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ఈ వారమే ముగియనున్న నేపథ్యంలో సూచీలు కాస్త ఒడుదొడుకులు ఎదుర్కోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనితోపాటు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరులు దృష్టిసారించొచ్చని చెబుతున్నారు.

ఈ వారం క్యూ1 ఫలితాలు ప్రకటించే కంపెనీలు..

యాక్సిస్​ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్​&టీ, టాటా మోటార్స్​, మారుతీ సుజుకీ, కోల్​గేట్​, టెక్ మహీంద్రా, బీహెచ్ఈఎల్​, ఐఓసీ, సన్​ఫార్మా, ఇండిగో వంటి కంపెనీలు ఈ వారం ఫలితాలు ప్రకటించే జాబితాలో ప్రధానంగా ఉన్నాయి.

వీటన్నింటితో పాటు కరోనా కేసులు, వ్యాక్సినేషన్ అప్​డేట్స్​, ముడి చమురు, రూపాయి మారకం విలువ వంటి అంశాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేసే సాధారణ అంశాలుగా ఉండనున్నాయి.

ఇదీ చదవండి:'2047 కల్లా అమెరికా సరసన భారత్‌'

ABOUT THE AUTHOR

...view details