వాహన రంగంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. కరోనాకు ముందే మందగమనాన్ని ఎదుర్కొన్న వాహన రంగం.. ఇప్పుడు మరింత సంక్షోభంలోకి జారుకున్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వాహన తయారీ పరిశ్రమల విభాగం 'సియామ్' వెల్లడించిన గణాంకాల ప్రకారం వరుసగా తొమ్మిదో త్రైమాసికంలోనూ ప్యాసిజర్ వాహనాల విక్రయాలు భారీగా తగ్గాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అమ్మకాలు ఏకంగా 78.43 శాతం పడిపోయాయి. ఏప్రిలో సంపూర్ణ లాక్డౌన్ ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా సియామ్ పేర్కొంది.
గత 20 ఏళ్లలో ఇదే సుదీర్ఘ మందగమనమని సియామ్ వెల్లడించింది.
ఏప్రిల్-జూన్లో ప్యాసింజర్ వాహనల విక్రయాలు..
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 1,53,734 ప్యాసింజర్ వాహనాలు మాత్రమే విక్రయమయ్యాయి. 2019 ఇదే సమయంలో ఈ సంఖ్య 7,12,684 యూనిట్లుగా ఉంది.
గతలో 2013-14 నుంచి 2014-15 మధ్య, 2000-01 నుంచి 2001-02ల మధ్య 5 త్రైమాసికాల్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు పడిపోయాయి.