అక్టోబర్ నెల ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాల్లో 14 శాతం వృద్ధి నమోదైనట్లు భారత వాహన తయారీదార్ల సంఘం(సియామ్) వెల్లడించింది. క్రితం సంవత్సరం అక్టోబర్‌లో 2,71,737 యూనిట్లను విక్రయించగా.. ఈ సారి 3,10,294 యూనిట్లు అమ్ముడయ్యాయి.
'ప్రయాణికుల వాహన విక్రయాల్లో 14 శాతం వృద్ధి' - అక్టోబర్‌లో కార్ల విక్రయాలు అందుర్స్
కరోనా సంక్షోభం నుంచి వాహన రంగం క్రమంగా కోలుకుంటోంది. గత నెల ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు 3,10,294 యూనిట్లుగా నమోదైనట్లు సియామ్ ప్రకటించింది. 2019 ఇదే సమయానికి 2,71,737 యూనిట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది.
!['ప్రయాణికుల వాహన విక్రయాల్లో 14 శాతం వృద్ధి' PV sales grow in October](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9517057-176-9517057-1605115496537.jpg)
అక్టోబర్‌లో పెరిగిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
ద్విచక్రవాహన టోకు విక్రయాల్లో 16.88శాతం, మోటార్‌సైకిళ్ల అమ్మకాల్లో 23.8 శాతం, స్కూటర్ విక్రయాల్లో 1.79 శాతం వృద్ధి నమోదైంది. ఒక్క త్రీవీలర్ విక్రయాలు మాత్రం 60.91 శాతం తగ్గాయి. దీపావళి పండగ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌ను అందుకోవడానికి డీలర్లు సిద్ధమయ్యారని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే టోకు విక్రయాలు పెరిగాయన్నారు.