ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు మరోసారి భారీగా పతనమయ్యాయి. కరోనా 2.O సెగతో మే నెలలో మొత్తం 85,733 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య(ఫాడా) గురువారం వెల్లడించింది. ఏప్రిల్‌తో (2,08,883 యూనిట్లు) పోలిస్తే ఈ మొత్తం 59శాతం తక్కువని పేర్కొంది.
Covid effect: కార్ల విక్రయాలు 59శాతం డౌన్!
కరోనా తొలి దశ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వాహన విక్రయాలు మరోసారి భారీగా క్షీణించాయి. కొవిడ్ రెండో దశ విజృంభణతో మేలో 85,733 కార్ల రిటైల్ విక్రయాలు మాత్రమే నమోదైనట్లు ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ఏప్రిల్‌తో పోలిస్తే ఈ విక్రయాలు 59 శాతం తక్కువ.
మేలో తగ్గిన వాహన విక్రయాలు
ఫాడా గణాంకాలు
- ద్విచక్ర వాహనాల రిటైల్ విక్రయాలు కూడా (ఏప్రిల్‌తో పోలిస్తే) మే నెలలో 53 శాతం తగ్గాయి. గత నెల 4,10,757 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 8,65,134 గా ఉంది.
- వాణిజ్య వాహనాల రిటైల్ విక్రయాలు కూడా గత నెల ఏకంగా 66 శాతం క్షీణించాయి. మొత్తం 17,534 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌లో 51,436 వాణిజ్య వాహనాలు విక్రయమయ్యాయి.
- త్రిచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్‌తో పోలిస్తే మేలో అత్యధికంగా 76 శాతం పడిపోయాయి. 5,215 యూనిట్లు మాత్రమే గత నెల అమ్ముడయ్యాయి.
- మేలో ట్రాక్టర్ల విక్రయాలు కూడా 57 శాతం తగ్గి.. 16,616 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఏప్రిల్‌లో 38,285 ట్రాక్టర్లు విక్రయమయ్యాయి.
- అన్ని క్యాటగిరీల వారీగా వాహనాల రిజిస్ట్రేషన్లు మేలో 55 శాతం (5,35,855 యూనిట్లకు) తగ్గాయి. ఏప్రిల్‌లో ఈ సంఖ్య 11,85,374 గా ఉంది.