పబ్జీ.. ఈ ఆన్లైన్ గేమ్‌ను దేశంలోని అనేకమంది ఇప్పటికీ మిస్ అవుతున్నారు. భారత ప్రభుత్వం నిషేధించిన ఈ మొబైల్ గేమ్ ఇవాళో.. రేపో మళ్లీ తిరిగొస్తుందని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. పబ్జీ లవర్స్ కలలు నెరవేరే రోజులు దగ్గర పడుతున్నట్టు కనిపిస్తోంది.
తాజాగా.. పబ్జీ కార్పొరేషన్‌కు సంబంధించిన ఉద్యోగాలు లింక్డ్ఇన్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో త్వరలో పబ్జీ రీ ఎంట్రీ ఇస్తుందన్న సంకేతాలు మరింత బలపడ్డాయి. సీనియర్ మార్కెటింగ్ మేనేజర్-ఇండియా, ప్రొడక్ట్ మేనేజర్-ఇండియా, వీడియో ఎడిటర్-ఇండియా, ప్రొడక్ట్ ఎనలిస్ట్-ఇండియా వంటి ఉద్యోగాలను లింక్డ్ఇన్లో పెట్టారు. గత నాలుగు రోజుల్లోనే ఇన్ని అప్లికేషన్లు పెట్టడం విశేషం. ఇవన్నీ బెంగళూరు ఆధారంగానే ఉన్నాయి. పబ్జీ ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉండే అవకాశముందని దీని ద్వారా తెలుస్తోంది.
వీటన్నింటినీ చూస్తే.. పబ్జీ రూపకర్త క్రాఫ్టాన్.. గేర్ మార్చి పనులు వేగవంతం చేసినట్టు కనిపిస్తోంది. టీమ్ రెడీ అవుతోందని.. కొత్త వర్షెన్కు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.