తెలంగాణ

telangana

ETV Bharat / business

పబ్‌జీ మళ్లీ వచ్చేస్తోంది..!

భారత్​లో నిషేధం విధించిన గేమింగ్​ యాప్​ పబ్​జీ మళ్లీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్​ సంస్థ.. భారత్​లో నియామకాలు చేపట్టేందుకు లింక్డ్​ఇన్​లో ఈ నెల 20న కొన్ని ఉద్యోగాలను పోస్ట్​ చేసింది. టెన్సెంట్​ పేరిట కాకుండా, క్రాఫన్​ పేరుతో పోస్ట్​ చేయడంతో.. ఆ గేమింగ్​ యాప్​ తిరిగి భారత్​లో అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది.

Pub-G is coming again !?
పబ్‌జీ మళ్లీ వచ్చేస్తోంది !?

By

Published : Oct 23, 2020, 7:25 AM IST

పబ్‌జీ గేమింగ్‌ యాప్‌ తిరిగి భారత్‌లోకి అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. కొన్ని వార్తల ప్రకారం.. పబ్‌జీ కార్పొరేషన్‌ యజమాని, దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్‌ సంస్థ భారత్‌లో నియామకాలు చేపట్టడం కోసం లింక్డ్‌ఇన్‌లో ఈనెల 20న కొన్ని ఉద్యోగాలను పోస్ట్‌ చేసింది. 'కార్పొరేట్‌ డెవలప్‌మెంట్‌ డివిజన్‌ మేనేజర్‌' బాధ్యతలు చేపట్టేవారి కోసం అందులో పోస్ట్‌ పెట్టడం చూస్తుంటే.. ఆ మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ తిరిగి భారత్‌లో అడుగుపెడుతోందన్న వార్తలకు బలాన్ని ఇస్తోంది. టెన్సెంట్‌ పేరిట కాకుండా.. క్రాఫన్‌ పేరుతో ఆ పోస్ట్‌ పెట్టింది. అంతే కాకుండా.. ‘చురుగ్గా నియామకాలు చేపడుతున్నట్లు’ అందులో తెలిపింది. కాగా, పబ్‌జీ గేమ్‌ మొబైల్‌ వెర్షన్‌పై భారత్‌లో నిషేధం ఉండగా.. కన్సోళ్లు, పీసీలపై ఇప్పటికీ వినియోగిస్తున్నారు. చైనా కంపెనీ టెన్సెంట్‌ గేమ్స్‌ 1.5 శాతం వాటాను బ్లూహోల్‌స్టూడియోలో కొనుగోలు చేసిన నేపథ్యంలో పబ్‌జీ మొబైల్‌పై భారత్‌ ఆ నిర్ణయం తీసుకుంది. దానితో పాటు 117 చైనా యాప్‌లపై నిషేధం విధించింది.

అయితే టెన్సెంట్‌ గేమ్స్‌ నుంచి పబ్‌జీ కార్ప్‌ పబ్లిషింగ్‌ హక్కులను వెనక్కి తీసుకుంది. మరో వైపు, నిషేధం కేవలం కొత్త డౌన్‌లోడ్లకు, బాటిల్‌ రాయల్‌ ఆటను ఆడకుండా ఉండేందుకు మాత్రమే వర్తిస్తుంది. ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ఆ యాప్‌ను తొలగించడానికి ముందే ఇన్‌స్టాల్‌ చేసుకునేవారు మాత్రం పబ్‌జీ గేమ్‌ ఆడుకోవచ్చు.

ఇదీ చూడండి:పబ్​జీ సహా 118 చైనా యాప్స్​పై నిషేధం

ABOUT THE AUTHOR

...view details