తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతనం పెంపు

దాదాపు మూడేళ్ల తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్లు, భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) చర్చలు ఫలించాయి. యూనియన్లు కోరినట్లే బ్యాంకుల సిబ్బందికి 15 శాతం వార్షిక వేతన పెంపు ఇచ్చేందుకు ఐబీఏ అంగీకరించింది. 2017 నవంబర్​ నుంచి వేతనాల పెంపు అమలులోకి రానుంది.

banker salaries Hike
బ్యాంకుల వేతనాల పెంపు

By

Published : Jul 23, 2020, 11:34 AM IST

కరోనా సంక్షోభంలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులుకు తీపి కబురు అందించింది భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ). ప్రభుత్వ రంగ బ్యాంకు యూనియన్లు డిమాండ్ చేసినట్లుగానే.. ఉద్యోగులకు 15 శాతం వార్షిక వేతన పెంపునకు అంగీకరించింది. వేతనాల పెంపుపై బ్యాంకు యూనియన్లు, ఐబీఏ మధ్య మూడేళ్లుగా చర్చలు జరిగాయి. చర్చలు ఫలించక యూనియన్లు పలుమార్లు సమ్మెలు కూడా చేపట్టాయి.

2017 నవంబర్​ నుంచే అమలు..

వేతనాల పెంపు 2017 నవంబర్ నుంచే వర్తించనున్నట్లు ఐబీఏ ప్రకటించింది. దీనితో దాదాపు 8.5 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. బ్యాంకులు ఇందుకు రూ.7,898 కోట్లు అదనంగా కేటాయించాల్సి వస్తుందని తెలిపింది.

పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్​ఐ)

ఐబీఏ, బ్యాంకు యూనియన్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ సిబ్బందికి పనితీరు ఆధారిత ప్రోత్సాహకం (పీఎల్​ఐ) ఇవ్వనున్నాయి. బ్యాంకుల లాభాల ఆధారంగా పీఎల్​ఐ ఉండనుంది. నిర్వహణ లాభం 5 శాతం కన్నా తక్కువగా ఉంటే.. పీఎల్​ఐ వర్తించదు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే పీఎల్​ఐని అమలు చేయనున్నాయి బ్యాంకులు.

ఇదీ చూడండి:ఎయిర్​ ఇండియా ఉద్యోగుల భత్యాల్లో భారీ కోత

ABOUT THE AUTHOR

...view details