ఆరోగ్యవంత జీవనశైలి గడిపే వినియోగదారులకు పాలసీల పునరుద్ధరణ (రెన్యువల్) ప్రీమియంపై 80-100 శాతం ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ప్రైవేటు ఆరోగ్య బీమా సంస్థలు సిద్ధమవుతున్నాయి. బహుమతులు, ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి.
సాధారణంగా ఆరోగ్య బీమా సంస్థలు క్లెయిమ్ చేయని సంవత్సరాలకు నో-క్లెయిమ్ బోనస్ కింద 25-50 శాతం మధ్య ఇస్తుంటాయి. అయితే ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్ ఇటీవల వినూత్న ఆరోగ్య బీమా పథకాన్ని ఆవిష్కరించింది. ఏడాది కాలంలో తగినన్ని రోజుల పాటు రోజూ 10,000 అడుగుల చొప్పున నడిచినా, లేదా తాము సూచించిన వ్యాయామం రోజూ 30 నిముషాల పాటు చేసినా, 6 నెలలకోసారి ఫిట్‌నెస్ పరీక్ష చేయించుకున్నా, మరుసటి ఏడాది పాలసీ పునరుద్ధరణ ప్రీమియంపై 100 శాతం వరకు హెల్త్ రిటర్న్‌లు ఇచ్చేందుకు సిద్ధమైంది.