ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రమోటర్లకు ఊరటనిచ్చే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) (Private Bank Guidelines RBI) అడుగులు వేసింది. ఈ బ్యాంకుల కార్పొరేట్ యాజమాన్య నిబంధల రూపకల్పనకు ఏర్పాటు చేసిన కార్యాచరణ బృందం చేసిన చాలా వరకు సిఫారసులను శుక్రవారం ఆమోదించింది. తొలి ఐదేళ్లలో ప్రమోటర్ల వాటాకు (Private Bank Guidelines RBI) స్వేచ్ఛనివ్వడమే కాక, 15 ఏళ్ల తర్వాత కూడా 26 శాతం వాటాను కొనసాగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం ఇది 15 శాతంగానే ఉంది.
ఎవరికి ప్రయోజనమంటే..
తాజా నిర్ణయాలు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లతో పాటు ఇతర ప్రైవేటు బ్యాంకుల (Private Bank Guidelines RBI) యాజమాన్యాలకు ప్రయోజనం చేకూర్చవచ్చు. తమ వాటాలను తగ్గించుకోవడానికి మరింత సమయం కోరుతున్న నిర్వాహకులకు ఇది ఊరటనిచ్చే చర్యే.
33 సిఫారసుల్లో 21కి ఆమోదం..
అంతర్గత కార్యాచరణ బృందం మొత్తం 33 సిఫారసులు చేయగా.. అందులో 21కి ఆర్‌బీఐ ఆమోదం వేసింది. మిగిలిన వాటిని పరిశీలనలో ఉంచింది. జూన్ 12, 2020న ఈ బృందాన్ని ఆర్‌బీఐ ఏర్పాటు చేయగా.. అది నవంబరు 20, 2020న నివేదికను సమర్పించింది. జనవరి 15, 2021 వరకు ప్రజాభిప్రాయ సేకరణకు అవకాశమిచ్చారు.
ప్రమోటర్లకు మేలు..
ప్రస్తుతం దీర్ఘకాలంలో ప్రమోటర్ల వాటాపై పరిమితి 15 శాతంగా ఉంది. దీనిని 26 శాతానికి (పెయిడప్ ఓటింగ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్‌లో) పెంచారు. ఇప్పటికే తమ వాటాను 26 శాతం దిగువకు చేర్చుకున్నవారికి (Private Bank Guidelines RBI) మాత్రం, మళ్లీ పెంచుకోవడానికి వీలుండదు. ఎవరైనా ప్రమోటరు 26 శాతం కంటే తక్కువకు చేర్చుకోవాలంటే మాత్రం ఐదేళ్ల లాకిన్ గడువు తర్వాత ఎప్పుడైనా ఆ పనిచేయొచ్చు.
ప్రమోటరేతర వాటాపై పరిమితి మారలేదు
ప్రమోటరేతర వాటా పరిమితి 10-15 శాతాన్ని అలానే ఉంచారు. ఏ ప్రైవేటు బ్యాంకులోనైనా 5 శాతం కంటే ఎక్కువ వాటా పొందడానికి ఆర్‌బీఐ అనుమతి తప్పనిసరి అనే నిబంధనలో మార్పు లేదు. (వ్యక్తులు, ఆర్థికేతర సంస్థలకు.. 10 శాతం; మిగతా ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వానికి.. 15 శాతం పరిమితి ఇకపైనా కొనసాగుతుంది.)
ఎన్‌ఓఎఫ్‌హెచ్‌సీ నుంచి వైదొలగొచ్చు..