తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆకాశాన్నంటిన టమాటా ధరలు.. కిలో @ రూ.400

దాయాది దేశం పాకిస్థాన్​కు టమాటా కష్టాలు ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. కరాచీలో గత వారం రూ.300గా ఉన్న కిలో టమాటా ప్రస్తుతం రూ.400కు పెరిగినట్లు స్థానిక మీడియా ద్వారా తెలిసింది.

By

Published : Nov 20, 2019, 9:51 PM IST

టమాటా

పొరుగు దేశం పాకిస్థాన్​లో టమాటా ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా ఆ దేశంలో అతిపెద్ద నగరం కరాచీలో కిలో టమాటా ధర రూ.400 దాటింది.

భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం.. భారత్​ నుంచి దిగుమతులపై విధించిన ఆంక్షలు.. టమాటా ధరలు ఈ స్థాయిలో పెరిగేందుకు కారణమని స్థానిక మీడియా పేర్కొంది.

ఇరాన్​ నుంచి దిగుమతి చేసుకున్నా..

ఇరాన్​ నుంచి 4,500 టన్నుల టమాటా దిగుమతికి పాక్ ప్రభుత్వం గత వారం అనుమతినిచ్చింది. వాటి రాక మార్కెట్లో డిమాండుని తీర్చలేకపోయింది. ఫలితంగా ధరలు ఆకాశాన్నంటుతున్నట్లు స్థానికులు అంటున్నారు.

అయితే ఇరాన్​ నుంచి మొత్తం 4,500 టన్నుల్లో ఇప్పటి వరకు.. 989 టన్నుల టమాటా మాత్రమే పాక్​కు చేరుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. కిలో టమాటాకు గతవారం ఉన్న రూ.300 నుంచి ఒక్క సారిగా రూ.400కు పెరగటం చూసి.. కరాచీ ప్రజలు కంగుతిన్నారు.

ఏరికోరి కష్టాలు..

జమ్ము కశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తరువాత భారత్​తో వ్యాపార సంబంధాలను తెంచుకుందిపాకిస్థాన్. ఫలితంగా భారత్​ నుంచి పాక్​కు టమాటా దిగుమతులు నిలిచిపోయాయి. దీనికి తోడు భారీ వర్షాలకు టమాటా పంట దెబ్బతినడం, ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది.

ఇదీ చూడండి:త్వరలో పంచదార కష్టాలు... ధరలు భారీగా పెరిగే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details