తెలంగాణ

telangana

ETV Bharat / business

మళ్లీ పెట్రో బాదుడు.. నేటి ధరలు ఎంతంటే? - OIL PRICES IN iNDIA

పెట్రోల్​, డీజిల్​ ధరలను మరోసారి పెంచాయి చమురు సంస్థలు. వరుస పెంపునకు బ్రేక్​ వేసినట్లే వేసి మళ్లీ ధరల పెంపునకే మళ్లాయి. దిల్లీలో నేడు లీటర్​ పెట్రోల్​పై 5 పైసలు, డీజిల్​పై 13 పైసలు పెంచాయి.

Price of petrol increases
మళ్లీ పెట్రో బాదుడు

By

Published : Jun 29, 2020, 8:08 AM IST

Updated : Jun 29, 2020, 9:09 AM IST

పెట్రోల్​, డీజిల్​ ధరల వరుస మోతకు బ్రేక్​ వేసినట్లే వేసి మళ్లీ పెంచాయి చమురు సంస్థలు. ఇటీవల దాదాపుగా రూ.10 వరకు పెంచిన నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఉపశమనం కల్పిస్తారని సగటు వినియోగదారులు భావించినా.. ఆ ఆశలు కొద్ది గంటల్లోనే ఆవిరయ్యాయి.

నేడు దిల్లీలో లీటరు పెట్రోల్​పై 5 పైసలు, డీజిల్​పై 13 పైసలు పెంచాయి చమురు సంస్థలు. దేశ రాజధానిలో లీటర్​ పెట్రోల్​ రూ. 80.43, డీజిల్​ రూ. 80.53కు చేరింది. లాక్​డౌన్​ అనంతరం పెట్రోల్​పై రూ. 9.17, డీజిల్​పై రూ. 11.14 పైసల వరకు పెరుగుదల నమోదైంది.

ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు..

నగరం

పెట్రోల్

(లీటరుకు రూ.లలో)

డీజిల్

(లీటరుకు రూ.లలో)

దిల్లీ 80.43 80.53 హైదరాబాద్ 83.47 78.67 బెంగళూరు 83.02 76.56 ముంబయి 87.17 78.81 చెన్నై 83.62 77.71 కోల్​కతా 82.08 75.62
Last Updated : Jun 29, 2020, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details