దేశవ్యాప్తంగా మరోసారి చమురు ధరలు పెరిగాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 26 పైసలు పెరిగి రూ. 97.76కు, డీజిల్‌పై 8 పైసలు పెంచటం వల్ల రూ. 88.30కు చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.89గా నమోదైంది. ఇక లీటర్ డీజిల్ ధర 95.79 వద్దకు చేరింది.
- తమిళనాడు చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.98.88 వద్ద అమ్ముడవుతోంది. లీటర్ డీజిల్ ధర.. రూ.92.89 వద్ద ఉంది.
- కోల్‌కతాలో లీటర్ పెట్రల్ రూ.97.63 కాగా, లీటర్ డీజిల్ రూ.91.15.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ.. పెట్రోల్ ధర లీటర్‌కు 20-27 పైసల వరకు పెరిగింది. లీటర్ డీజిల్ ధరను సైతం 8 పైసల వరకు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగానూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరించినట్లు సంస్థలు వెల్లడించాయి.