బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర - ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఈరోజు ధర
![బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర Price of domestic LPG cylinder with subsidy increased by Rs 25.50 per cylinder with effect from today](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12318674-thumbnail-3x2-gas.jpg)
09:28 July 01
బండ బాదుడు: మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర
సామాన్యులపై మరో భారం పడింది. వంట గ్యాస్ ధర రూ.25.50 పెరిగింది. దీనితో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 834.50కి చేరింది. 19కేజీల సిలిండర్‌పై రూ. 76 పెరిగి రూ. 1,550కి చేరింది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
ఇక వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై నగరాల్లో ఏప్రిల్ 1 నుంచి సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.10 తగ్గించాయి.