Pre Budget Consultations: 2022-23 సార్వత్రిక బడ్జెట్ రూపకల్పనకు బుధవారం కసరత్తు మొదలుపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వ్యవసాయ రంగ, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి పరిశ్రమ నిపుణులతో ఆమె చర్చించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ట్విట్టర్ ద్వారా తెలిపింది.
"2022-23 బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ తయారీకి ముందు వివిధ వర్గాలు, నిపుణులతో సంప్రదింపులు జరపనున్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. డిసెంబరు 15న వర్చువల్గా ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి."
-- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ