తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇకపై ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్​జీ గ్యాస్​! - home delivery of petrol and CNG

డీజిల్ డోర్​ డెలివరీ విజయవంతం అయిన నేపథ్యంలో.. పెట్రోల్​, సీఎన్​జీ గ్యాస్​లను కూడా ఇంటి వద్దకే పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అలాగే పెట్రోల్, డీజిల్, సీఎన్​జీ, ఎల్​ఎన్​జీ, ఎల్​పీజీ ఇలా అన్ని రకాల ఇంధనాలు ఒకే చోట లభ్యమయ్యేలా నూతన విధానాన్ని ఆవిష్కరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు.

Pradhan envisages home delivery of petrol, CNG
ఇకపై ఇంటి వద్దకే పెట్రోల్, సీఎన్​జీ గ్యాస్​!

By

Published : May 29, 2020, 8:16 PM IST

వినియోగదారులకు అనుకూలంగా పెట్రోల్, సీఎన్​జీ గ్యాస్​లకు డోర్​ డెలివరీ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ తెలిపారు. ఇప్పటికే డీజిల్ డోర్​ డెలివరీ విజయవంతం అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 11 రాష్ట్రాల్లో 56 కొత్త సీఎన్​జీ స్టేషన్లు ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నీ ఒకే చోట

పెట్రోల్​, డీజిల్, సీఎన్​జీ, ఎల్​ఎన్​జీ, ఎల్​పీజీ... ఇలా అన్ని రకాల ఇంధనాలు ఒకే చోట లభించేలా ఒక్క ఇంధన రిటైలింగ్ మోడల్​ను ఆవిష్కరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఐఓసీ

దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) 2018 సెప్టెంబర్​ నుంచి మొబైల్ డిస్పెన్సర్ ద్వారా డీజిల్​ను డోర్​ డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే ఈ సౌలభ్యం కొన్ని నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.

సురక్షిత పద్ధతులు అవసరం

డీజిల్ కంటే పెట్రోల్​, సీఎన్​జీలకు మండే స్వభావం ఎక్కువ. కనుక ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఎక్కువ. అందుకే వీటిని డోర్​ డెలివరీ చేయలాంటే మరింత సురక్షితమైన పద్ధతులు, టెక్నాలజీ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.

ఇదీ చూడండి:క్లినికల్ ట్రయల్స్​కు 'సన్​ఫార్మా'కు అనుమతి

ABOUT THE AUTHOR

...view details