దేశంలో విద్యుత్ డిమాండ్(ఒక రోజులో అత్యధిక సరఫరా) భారీగా పెరిగి 185.82 గిగా వాట్లతో.. జీవనకాల గరిష్ఠానికి చేరిందని సంబంధిత కార్యదర్శి ఎస్ఎన్ సహాయ్ తెలిపారు. 'విద్యుత్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా బుధవారం ఉదయం 9:35 గంటలకు 185.82 గిగా వాట్లకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డ్ 182.89 గిగావాట్లుగా(2020 డిసెంబర్ 30) ఉండేది.' అని ట్విట్టర్లో పేర్కొన్నారు సహాయ్.
విద్యుత్ శాఖ గణాంకాల ప్రకారం.. గత జనవరిలో గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 170.97 గిగా వాట్లుగా ఉండేది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన క్రమంలో వాణిజ్య, పారిశ్రామిక డిమాండ్‌కు దారితీసే ఆర్థిక కార్యకలాపాలు పెరగటం.. విద్యుత్ వినియోగం భారీగా పెరిగినట్టు తెలుస్తోంది.