దిగ్గజ వ్యాపారవేత్త బిల్‌గేట్స్ బిలియనీర్ అని అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా ఆయనకు సంబంధించిన మరో విషయం బయటకు వచ్చింది. అమెరికా వాషింగ్టన్లో ఆయనకున్న వ్యవసాయ క్షేత్రాలు.. అంతరిక్షం నుంచి చూసినా కనపడతాయట! మెక్‌డొనాల్డ్స్ ఫ్రైస్ తయారీలో వాడే బంగాళదుంపలను ఈ క్షేత్రాల్లో పండిస్తారట. ఈ విషయాన్ని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా వెల్లడించింది.
మొత్తం మీద అగ్రరాజ్యంలోని 18రాష్ట్రాల్లో బిల్ గేట్స్‌కు 2,69,000కుపైగా వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఆయన సొంత భూములు కాగా.. మరికొన్ని ఆయన పెట్టుబడుల సంస్థ కాస్కేడ్కు చెందినవి.