తెలంగాణ

telangana

ETV Bharat / business

మార్కెట్లు: అంతర్జాతీయ సానుకూలతతో ఈ వారమూ ముందుకే! - తెలుగు స్టాక్ మార్కెట్​ వార్తలు

అంతర్జాతీయ సానుకూలతల నడుమ ఈ వారం స్టాక్​ మార్కెట్లు సానుకూలంగా కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ముగియడం ఇందుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.

OUTLOOK
స్టాక్ మార్కెట్ వార్తలు

By

Published : Dec 15, 2019, 3:54 PM IST

స్టాక్ మార్కెట్లు ఈ వారమూ లాభాలను నమోదు చేసే అవకాశముందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఈ వారం అంతర్జాతీయ సానుకూలతలు.. ఇందుకు కారణమవుతాయని వారు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయంగా చూస్తే.. ఎన్నో నెలల వాణిజ్య యుద్ధం అనంతరం అమెరికా-చైనా మధ్య తొలి దశ ఒప్పందం కుదిరింది. దీనికి తోడు బ్రిటన్​ ప్రధానిగా బోరిస్ జాన్సన్మరోసారి​ విజయం సాధించడం వల్ల సానుకూలతలు మరింత పెరిగే అవకాశముందని నిపుణుల విశ్లేషణ.

దేశీయంగా మైక్రో ఎకనామిక్ గణాంకాలు మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలుగా ఉండనున్నాయి. సోమవారం విడుదలకానున్న టోకు ద్రవ్యోల్బణం గణాంకాలపై మదుపరులు దృష్టి సారించొచ్చని స్టాక్ బ్రోకర్లు అంటున్నారు.

వీటితో పాటు.. ముడి చమురు ధరలు, డాలర్​తో రూపాయి మారకం విలువ వంటివీ మార్కెట్లపై ప్రభావం చూపించే అవకాశముంది.

ఇదీ చూడండి:ఠాక్రేకు 'పీఎంసీ' ఖాతాదారుల నిరసనల సెగ

ABOUT THE AUTHOR

...view details