కొవిషీల్డ్ టీకా కోసం ఎదురుచూస్తున్న దేశాలు ఓపికతో ఉండాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా పేర్కొన్నారు. తొలుత భారతదేశ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తమకు ఆదేశాలు అందాయని తెలిపారు.
భారత్ అవసరాలకు తగ్గట్లుగా టీకాలను సరఫరా చేసి, ఇతర దేశాల అవసరాలను తీర్చేందుకు సమన్వయంతో ప్రయత్నాలు చేస్తామని పూనావాలా ట్వీట్ చేశారు.
"కొవిషీల్డ్ టీకా కోసం ఎదురుచూస్తున్న వివిధ దేశాలు, ప్రభుత్వాలు సహనంతో ఉండాలని కోరుతున్నా. భారత్లో అవసరాలను ప్రాధాన్య క్రమంలో తీర్చి, ప్రపంచదేశాలపై దృష్టిసారించాలని సీరం సంస్థకు ఆదేశాలు అందాయి. మేం మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాం."