తెలంగాణ

telangana

ETV Bharat / business

'పెప్సికో ఇండియా'కు కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు - pepsico india latest news

పెప్సికో ఇండియా ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డును అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో చేతులమీదుగా అందుకుంది. 17 బిలియన్ లీటర్ల నీటికి ఆదా చేసినందుకు, 60 వేల మంది కమ్యూనిటీ సభ్యులను సానుకూలంగా ప్రభావితం చేసినందుకు గానూ ఈ అవార్డుకు పెప్సికో ఇండియా ఎంపికైంది.

'పెప్సికో ఇండియా'కు యూఎస్​ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డు

By

Published : Nov 1, 2019, 10:03 AM IST

అమెరికా విదేశాంగమంత్రి మైక్​ పాంపియో ప్రతిష్ఠాత్మక కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డును పెప్సికో ఇండియాకు ప్రదానం చేశారు. పెప్సికో ఇండియా కమ్యూనిటీ... జల కార్యక్రమాల ద్వారా 17 బిలియన్ లీటర్లకుపైగా నీటిని ఆదా చేసిందని, వేలాది మంది కమ్యూనిటీ సభ్యులను సానుకూలంగా ప్రభావితం చేసిందని కొనియాడారు.

"మనం ఈ రోజు పెప్సికోకు చెందిన ఓ ప్రాంతీయ విభాగం పెప్సికో ఇండియాను గౌరవించాం. భారతదేశంలో బంగాళాదుంపలను అత్యధికంగా కొనుగోలు చేసే సంస్థ ఇది. 24 వేల మంది చిన్న రైతులకు స్థిర ఆదాయం చేకూరుస్తూ ఈ సంస్థ ఆదుకుంటోంది. కరవు ప్రాంతాలకు నీటిని అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. ఫలితంగా దాదాపు 5 బిలియన్​ లీటర్ల జల వనరులను పునరుద్ధరించింది."- మైక్​ పాంపియో, అమెరికా విదేశాంగమంత్రి

1999లో స్థాపితమైన ఏసీఈ(అవార్డ్​ ఫర్​ కార్పొరేట్​ ఎక్సలెన్స్​ బాధ్యతాయుతమైన సభ్యులను కలిగి... ఉన్నత ప్రమాణాలను పాటించి, ప్రోత్సహించే అమెరికా సంస్థలను గుర్తిస్తుంది. భారత్​లో స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంపొందిస్తున్నందుకు.. 'పెప్సికో ఇండియా' బహుళజాతి సంస్థల విభాగంలో 'గ్లోబల్ ఏసీఈ' విజేతగా నిలిచింది.

అవార్డు గ్రహీతలు

కార్పొరేట్​ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీతల్లో.. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్​ కాంగోకు చెందిన ఛాంబర్స్ ఫెడరేషన్​, సింగపూర్​కు చెందిన ప్రొక్టర్​ అండ్ గాంబుల్ ఆసియా పసిఫిక్, ఉగాండాలోని ఎజిలిస్ పార్ట్​నర్స్​ కూడా ఉన్నాయి.

స్వేచ్ఛా మార్కెట్ విలువలు

ఈ కంపెనీలు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు సృష్టిస్తున్నాయని పాంపియో పేర్కొన్నారు. ఇవి స్థిరంగా పెట్టుబడులు పెడుతూ, పారదర్శకంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు. అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలు అందించడం ద్వారా అమెరికా స్వేచ్ఛా మార్కెట్ విలువలను ప్రపంచానికి తెలుపుతున్నాయని పాంపియో వెల్లడించారు.

ఇదీ చూడండి: మొదటిసారిగా 108 ఎమ్​పీ​ కెమెరాతో.. షియోమీ నోట్​ 10!

ABOUT THE AUTHOR

...view details