తెలంగాణ

telangana

ETV Bharat / business

Health insurance: ఆరోగ్య బీమాకు జీఎస్‌టీ సుస్తీ

కరోనా మహమ్మారితో(Corona virus) ఆరోగ్య బీమా(Health insurance ) అవసరం ఎంతో పెరిగింది. అయితే.. ఆరోగ్య బీమాపై జీఎస్​టీ 18శాతం చెల్లించాల్సి రావటం పాలసీదార్లకు భారంగా మారుతోంది. దీంతో మధ్య తరగతి, విశ్రాంత ఉద్యోగులు తక్కువ మొత్తానికే పరిమితమవుతున్నారు. జీఎస్​టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు.

Health insurance
ఆరోగ్య బీమాకు జీఎస్‌టీ సుస్తీ

By

Published : Nov 10, 2021, 7:16 AM IST

చిన్న అనారోగ్యానికీ రూ.లక్షల్లో ఖర్చవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా(Health insurance ) అవసరం ఎంతో పెరిగింది. కొవిడ్‌-19(Corona virus) తర్వాత క్లెయింలు ఒక్కసారిగా పెరగడంతో పాలసీ సంస్థలకు భారంగా మారింది. ఆరోగ్య బీమాపై వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) 18శాతం(st on health insurance india) వరకు చెల్లించాల్సి రావడం పాలసీదార్లకు కష్టమవుతోంది. ఈ భారం వల్లే మధ్య తరగతి ఆదాయ వర్గాలు, విశ్రాంత ఉద్యోగులకు తక్కువ మొత్తం వైద్యబీమా పాలసీలకు పరిమితమవుతున్నారు.

ఆరోగ్య బీమా(health insurance gst) అవసరం ఏముందిలే అనుకున్న వారి ఆలోచనలు కొవిడ్‌-19 తర్వాత మారిపోయాయి. ఆరోగ్య బీమా పాలసీల సంఖ్యలో వృద్ధి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార మండలి (ఐఆర్‌డీఏఐ) సైతం కరోనా కవచ్‌, కరోనా రక్షక్‌ పేరుతో ప్రామాణిక పాలసీలను తీసుకు రావడంతో పాటు, ఆరోగ్య సంజీవని పేరుతో ప్రామాణిక ఆరోగ్య బీమానూ తీసుకొచ్చింది. క్లెయింల సంఖ్య, వైద్య చికిత్సకు అవుతున్న మొత్తం పెరగడం.. భవిష్యత్తులోనూ కరోనా వ్యాపిస్తుందనే భయాలుండటంతో బీమా సంస్థలు ఒక్కసారిగా ప్రీమియాన్ని పెంచేశాయి. పాలసీపై 18శాతం జీఎస్‌టీని ప్రభుత్వం విధించడం సహేతుకం కాదని బీమా నిపుణులు పేర్కొంటున్నారు.

రూ.వేలల్లోనే..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం రూ.5లక్షల ఆరోగ్య బీమా(health insurance gst) తప్పనిసరి. బీమా నిపుణుల ప్రకారం చూస్తే.. ఇది చాలా తక్కువ మొత్తమే. అయినా కూడా దంపతులు ఈ మొత్తం పాలసీ తీసుకునేందుకు జీఎస్‌టీ కిందే వయస్సును బట్టి రూ.2700-13900 వరకు చెల్లించాల్సి రావడం కష్టంగా మారుతోంది. నలుగురు సభ్యులున్న కుటుంబానికి కనీసం రూ.20 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్‌ ఆరోగ్య బీమా పాలసీ(health insurance plans) ఉండాలని సూచిస్తున్నారు. జీఎస్‌టీ భారంగా మారడంతో, అధిక విలువ పాలసీలను తీసుకునేందుకు చాలామంది ముందుకు రావడం లేదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. బీమా పాలసీలను 5శాతం జీఎస్‌టీ శ్లాబులోకి తీసుకురావాలని బడ్జెట్‌ సందర్భంగా ఆర్థిక మంత్రికి ఎన్నో వినతులు వచ్చాయి. జీఎస్‌టీ మండలి సమావేశాల సందర్భంగానూ పరిశ్రమ వర్గాల నుంచి వినతులు వెళ్తున్నా, సానుకూల స్పందన రావడం లేదు.

ప్రభుత్వానికి పెద్దగా ఆదాయమూ తగ్గదు

'2020-21లో ఆరోగ్య బీమా ప్రీమియం వసూళ్లు దాదాపు రూ.26వేల కోట్లున్నాయి. ఏటా 15శాతం వృద్ధి అనుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.30 వేల కోట్లకు చేరుతుంది. అంటే ప్రీమియం మీద జీఎస్‌టీ 18 శాతం ఉంటే.. రూ.5,400 కోట్లు అవుతాయి. అదే జీఎస్‌టీని 5 శాతానికి తగ్గిస్తే.. రూ.1,500 కోట్లు అవుతుంది. అంటే.. ప్రభుత్వానికి తగ్గే ఆదాయం రూ.3,900 కోట్లు. కానీ వ్యక్తిగతంగా ఎంతోమందికి ఊరట కలుగుతుంది. ఎక్కువ మొత్తానికి పాలసీ తీసుకునే వారు, కొత్తగా పాలసీలను తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది. కాబట్టి, ప్రీమియం వసూళ్లు పెరిగే అవకాశం లేకపోలేదు. అప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఆదాయమూ పెరుగుతుంది. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశమే.'

- మాధవ ఎండ్లూర్‌, బీమా నిపుణులు

(ప్రీమియాలు అంచనా కోసం మాత్రమే. పూర్తి వివరాలకు మీ బీమా సంస్థను సంప్రదించండి)

పైన పేర్కొన్న ప్రీమియాలకు కొన్నిసార్లు అదనపు భారమూ ఉండొచ్చు. బీమా(health insurance plans) తీసుకునే వ్యక్తికి ఏదైనా ముందస్తు వ్యాధులుంటే.. ప్రీమియంలో 10-25శాతం వరకూ ప్రీమియం పెరుగుతుంది. ముఖ్యంగా అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న వారికి పాలసీ రావాలంటే అధిక ప్రీమియం చెల్లించాల్సిందే.

ఇదీ చూడండి:ఆరోగ్య బీమా పాలసీలో ఈ రైడర్లు ఉంటే మేలు

ABOUT THE AUTHOR

...view details