తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 9:32 PM IST

ETV Bharat / business

వీధి వ్యాపారుల 'సూక్ష్మ రుణ పథకాన్ని' సమీక్షించిన పీఎం

'పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్​ నిధి' స్కీమ్ అమలుతీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. దీన్ని వీధి వ్యాపారులకు మరింత రుణాలు ఇచ్చే పథకం చూడకూడదని ఆయన స్పష్టం చేశారు. వీధి వ్యాపారుల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా దీనిని అమలుచేస్తున్నట్లు తెలిపారు.

PM reviews micro credit scheme for street vendors
వీధి వ్యాపారుల 'సూక్ష్మ రుణ పథకాన్ని' సమీక్షించిన పీఎం మోదీ

వీధి వ్యాపారుల కోసం తీసుకొచ్చిన 'మైక్రో క్రెడిట్ పథకం' అమలుతీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. వీధి వ్యాపారుల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు.

సేవానిధి...

వీధి వ్యాపారుల కోసం పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం సేవానిధి)ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా వీధి వ్యాపారులకు ఒక సంవత్సరానికి గాను రూ.10,000 ఆర్థిక సాయం (లోన్) అందిస్తారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులు... కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ల వల్ల నిలిచిపోయిన తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుకోవడానికి వీలుకలుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

భారీగా దరఖాస్తులు

'పీఎం సేవానిధి పథకం లబ్ధి కోసం 2.6 లక్షలకు పైగా దరఖాస్తు చేస్తే... 64,000 మందికిపైగా మంజూరు చేశాం. ఇప్పటికే 5,500 మందికి ఆ మైక్రో క్రెడిట్​ను కూడా అందించాం' అని పీఎం సమీక్షలో అధికారులు తెలిపారు.

ఈ పథకం అమలులో పారదర్శకత, జవాబుదారీతనం, వేగాన్ని నిర్ధరించడానికి... ఓ వెబ్​ పోర్టల్, మొబైల్ అప్లికేషన్​ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ కూడా సంతృప్తి వ్యక్తం చేశారని వారు వెల్లడించారు.

డిజిటల్ లావాదేవీలు!

ఈ పథకం అమలును హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తోంది. వీధి వ్యాపారుల ఏవైనా సమస్య వస్తే.. మొబైల్ అప్లికేషన్ ద్వారా పూర్తిస్థాయిలో ఐటీ పరిష్కారం చూపిస్తుంది. అలాగే వీధి వ్యాపారాల్లో డిజిటల్ లావాదేవీల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.

"ఈ పథకం... వీధి వ్యాపారుల మొత్తం వ్యాపారాన్ని కవర్ చేయాలి. ముడిపదార్థాల సేకరణ నుంచి అమ్మకపు ఆదాయాల సేకరణ వరకు. ఇందుకోసం వ్యాపారులకు తగిన ప్రోత్సాహాలు, శిక్షణ ఇవ్వాలి. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలి. ఇది వీధి వ్యాపారుల భవిష్యత్​ ఆర్థిక అవసరాలకు సాయపడేలా.. క్రెడిట్ ప్రొఫైల్ రూపొందించడంలో సాయపడుతుంది."

- ప్రధాని మోదీ

అయితే ఈ పీఎం సేవానిధి పథకాన్ని... వీధి వ్యాపారులకు మరింత రుణాలు మంజూరు చేసే స్కీమ్​గా చూడకూడదని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. దీన్ని వీధి వ్యాపారుల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక అభ్యున్నతిలో ఒక భాగంగా చూడాలని పేర్కొన్నారు.

క్రెడిట్ ప్రొఫైల్​

పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి స్కీమ్ ద్వారా వీధి వ్యాపారుల క్రెడిట్ ప్రొఫైల్ తయారుచేస్తారు. దీని ఆధారంగానే... పీఎంఏవై-యూ కింద గృహరుణాలు, ఉజ్వల కింద వంటగ్యాస్, సౌభాగ్య కింద విద్యుత్ సౌకర్యం, ఆయుష్మాన్ భారత్​ కింద వైద్య సౌకర్యం, జన్​ధన్​ పథకం ద్వారా బ్యాంకు ఖాతాలను వీధి వ్యాపారులకు అందిస్తారు.

ఇదీ చూడండి:ఏప్రిల్​లో 82 లక్షల చందాదారులను కోల్పోయిన టెల్కోలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details