చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన వేళ 'ఆత్మనిర్భర భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్' లో పాల్గొనాలని దేశీయ స్టార్టప్ కంపెనీలను కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ఛాలెంజ్.. ఆత్మనిర్భర యాప్ ఎకో సిస్టమ్‌ను తయారు చేస్తుందన్నారు. అలా తయారయ్యే దేశీయ యాప్‌ల్లో కొన్నిటిని తాను కూడా వాడవచ్చేమోనని.. లింక్డ్‌ఇన్‌లో పేర్కొన్నారు.
"ప్రపంచస్థాయి మేడ్ ఇన్ ఇండియా యాప్‌లను తయారు చేసేందుకు.. భారతీయ సాంకేతిక, స్టార్టప్ కంపెనీలు ఎంతో ఉత్సుకతతో ఉన్నాయి. అలాంటి వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సాంకేతిక శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ఆత్మనిర్భర భారత్ యాప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్‌ను ప్రారంభించాయి. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఇప్పటికే ఉన్న యాప్‌లను అభివృద్ధి చేయడం, రెండోది కొత్త యాప్‌లను సృష్టించటం."
- నరేంద్ర మోదీ ప్రధానంత్రి.