ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని చేపట్టి.. కేవలం 12 రోజుల్లోనే 23 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొన్ని నెలల్లోనే 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో వర్చువల్గా పాల్గొన్న మోదీ ఈ వివరాలు తెలిపారు.
భారత్ ప్రస్తుతం రెండు టీకాలు తయారు చేసిందని.. త్వరలో మరిన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. కరోనా కారణంగా భారత్ ప్రపంచస్థాయి బాధ్యతను తీసుకుని.. 150 దేశాలకు అవసరమైన ఔషధాలు సరఫరా చేసిందని గుర్తు చేశారు.