లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఇప్పటివరకు 30 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.28,256 కోట్లు ఆర్థిక సహాయం అందించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా ఎదురయ్యే కష్టాలను అధిగమించేందుకు రూ.1.70 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.
పీఎం కిసాన్, జన్‌ధన్ ఖాతాలకు నగదు బదిలీ - ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం
ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద ఇప్పటివరకు 30 కోట్ల మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపింది కేంద్ర ఆర్థికశాఖ. ఇందుకోసం రూ.28,256 కోట్లు వ్యయం చేసినట్లు వెల్లడించింది.
30 కోట్ల మందికి 28,256 కోట్లు
ఈ మొత్తంలో తొలి విడత కింద పీఎం కిసాన్ నిధులు రూ.13,855 కోట్లు, జన్‌ధన్ కింద రూ.9,930 కోట్లు, జాతీయ తోడ్పాటు పథకం(ఎన్‌ఎస్‌ఏపీ) కింద రూ.1,400 కోట్లు, పింఛన్ల కింద రూ.2.82 కోట్లు ఆయా లబ్ధిదారుల ఖాతాలకు బదిలీ చేసినట్లు తెలిపింది.