పాత రోజుల్లో ఐదెంకెల జీతం అంటెనే ఆశ్చర్యపడేవారు.. కానీ ప్రస్తుతం అలా కాదు సంపాదనా సామర్ధ్యం పెరిగింది. ఐదెంకెలు, అరెంకెల, అంతకంటే ఎక్కువ సంపాదన ఉన్నవారు చాలామంది ఉన్నారు. అయితే సంపాదన ఎంత ఉన్నా ఊహించిన ఖర్చులు వచ్చినప్పుడు.. ఎదుర్కోవడంలో తడబడుతున్నారు చాలామంది. చివరికి రుణం తీసుకోక తప్పడం లేదు. తిరిగి చెల్లించేందుకు సంపాదన మొత్తం సరిపోతుంది. పొదుపు, పెట్టుబడులకు మాటే ఉండడం లేదు. ఆర్థిక అసమానతల వల్ల మానసికంగా ఒత్తిడికి గురై ఆనారోగ్యం పాలవుతున్నారు.
ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడాలన్నా, ఊహించిన పరిస్థితులను, ఖర్చులను సమర్థవంతంగా ఎదుర్కుని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించాలన్నా.. పొదుపు, మదుపు రెండూ క్రమశిక్షణతో చేయాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇందుకోసం ముఖ్యంగా ఉండాల్సింది ప్రణాళిక. ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేరిన వారి దగ్గర నుంచి కేరీర్ మధ్యలో ఉన్న, పదవీ విరమణ దశలో ఉన్నా..చివరికి పదవీ విరమణ చేసినా కూడా ఆర్థిక ప్రణాళిక ఉండాల్సిందే. మనం చేసే ఏ పని అయినా ఒక ప్రణాళిక ప్రకారం.. క్రమశిక్షణతో చేస్తేనే విజయం సాధించగలం. ఇదే సూత్రం ఆర్థికంగానూ వర్తిస్తుంది.
ఆర్థిక ప్రణాళిక ఈ కింది విషయాలలో సహాయపడుతుంది.
- ఆర్థిక ప్రణాళిక ఉంటే..స్పష్టత ఉంటుంది.
- ఆదాయం, ఖర్చుల నిర్వహణలో సమతుల్యత ఉండేలా సహాయపడుతుంది.
- నగదు ఎక్కడ ఖర్చవుతుందో తెలుస్తుంది.. దీంతో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవచ్చు.
- లక్ష్యానికి తగినట్లు పెట్టుబడులు చేస్తూనే.. పన్ను మినహాయింపు మార్గాలు అన్వేషించడంలో సహాయపడుతుంది.
- ఉత్తమ పెట్టుబడుల ఎంపకతో.. సాధ్యమైనంత ఎక్కవ రాబడికి సహాయపడుతుంది.
- సంపద నిర్వహణ సులభమవుతుంది.
- పదవీ విరమణ జీవితాన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ఎంత పెట్టుబడి పట్టగలం..
ఆర్థిక ప్రణాళికను రూపొందించే ముందు, మీ ఆర్థిక పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. వార్షిక, నెలవారీ ఆదాయం..ఖర్చులను పరిశీలించండి. అత్యవసర ఖర్చులు లేదా అనుకోని ఖర్చులు ఎప్పుడూ ఉండవు కాబట్టి వాటిని ప్రక్కన పెడితే రోజువారి అవసరాలు అద్దె, కిరాణా, బీమా చెల్లింపులు, ప్రయాణ ఖర్చులు వంటి సాధారణ ఖర్చులపై దృష్టి పెట్టాలి. దీని వల్ల మన ఆదాయంలో ఖర్చులు పోనూ ఎంత పొదుపు చేయోచ్చో తెలుస్తుంది. దీనిలో ఎంత పెట్టుబడి పెట్టగలమో అర్థం అవుతుంది.
ప్రస్తుత పెట్టుబడులు..
ప్రస్తుతం ఉన్న ఆస్తులు అంటే సొంత స్థలం, ఇల్లు లేదా మరేదైనా ఆస్తి, బంగారం, మ్యూచవల్ ఫండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ప్రస్తుత పెట్టుబడులు జాబితాను తయారు చేయండి. ఇందులో నుంచి ఇంటి విలువను, బంగారాన్ని తీసివేసి మిగిలిన ఆస్తులు, పెట్టుబడులను అంచనా వేయండి.
లక్ష్యాలు..
ఆదాయం, ఖర్చులు, పొదుపు గురుంచి ఒక అవగాహనకు వచ్చాక ఆర్థిక ప్రణాళిక రూపొందించాలి. ఇందుకోసం తరువాత చేయాల్సి పని మీ ఆర్థిక లక్ష్యాలు ఏంటి.. ఆలోచించి, ఒక జాబితాను రూపొందించండి. ఇందులో నుంచి అధిక ప్రాధాన్యత ఉన్న వాటిని షార్ట్ లిస్ట్ చేయండి. ఈ లక్ష్యాలను చేరుకునేందుకు ఎంత మొత్తం అవసరమవుతుంది అంచనా వేయండి. ఉదాహరణకి.. మీరు కొంత కాలం తరువాత ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనుకుందాం. దీనికి ఎంత మొత్తం అవసరమవుతుంది.. ఎంత సమయం ఉంది.. ఇప్పటి వరకు ఎంత కూడబెట్టారు..ఇంకా ఎంత మొత్తం అవసరమవుతుంది.. అంచనా వేయండి. ఇక్కడ ఒక విషయం గుర్తించుకోవాలి.. ప్రస్తుతం ఉన్న ధర భవిష్యత్తులో ఉండకపోవచ్చు.. ధర గణనీయంగా పెరగచ్చు.. అందువల్ల ద్రవ్యోల్భణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని లక్ష్యానికి అవసరమైన మొత్తాన్ని అంచనా వేయాలి.
బీమా..
మీ, మీకుటుంబ రక్షణకు అవసరమైన జీవిత, ఆరోగ్య బీమాలు తీసుకున్నారా.. లేదా.. చూడాలి. మీపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు టర్మ్ బీమా తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రస్తుత వార్షిక ఆదాయానికి కనీసం 15-20 రెట్లు హామీ మొత్తం ఉండాలి. అలాగే ఆరోగ్య భద్రత కోసం మీతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్య బీమా ఉండేలా చూసుకోవాలి.
పెట్టుబడులు..