కరోనా సంక్షోభం వేళ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది భారతీయ స్టేట్ బ్యాంకు. ఈ ఏడాది 14,000 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపింది. ఇటీవల ప్రకటించిన ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) పథకం.. ఖర్చు తగ్గించుకునేందుకు చేపట్టిన ప్రక్రియ కాదని స్పష్టం చేసింది.
" ఉద్యోగులతో బ్యాంకు స్నేహపూర్వకంగా ఉంటుంది. ప్రజలకు మరిన్ని సేవలు అందుబాటులో తెచ్చేందుకు కార్యకలాపాలను విస్తరిస్తోంది. అందుకు ఈ ఏడాది 14 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకునే ప్రణాళికలు రచిస్తోంది. ప్రస్తుతం 2.50 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఉద్యోగులకు సౌకర్యాల కల్పనలో మా బ్యాంకు ముందుంటుంది. జాతీయ అప్రెంటిస్ పథకంలో భాగంగా దేశంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇస్తోన్న ఏకైక బ్యాంకు ఎస్బీఐ.