తెలంగాణ

telangana

Phonepe News: యూజర్లకు ఫోన్​పే షాక్​- వాటిపై ఛార్జీలు

By

Published : Oct 23, 2021, 5:11 AM IST

యూపీఐ ఆధారిత లావాదేవీలపై ప్రాసెసింగ్​ రుసుములు (Phonepe UPI Transaction Charges) విధించడం ప్రారంభించింది ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్​పే (Phonepe News). రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది.

PhonePe
phonepe news

వాల్‌మార్ట్‌ గ్రూప్‌నకు చెందిన డిజిటల్‌ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే (Phonepe News), ఫోన్‌ రీఛార్జులపై ప్రాసెసింగ్‌ రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. రూ.50 కంటే అధిక విలువ కలిగిన మొబైల్‌ రీఛార్జీలపై లావాదేవీకి రూ.1-2 చొప్పున వసూలు చేయనుంది. రీఛార్జి లావాదేవీ యూపీఐ ద్వారా చేసినా, ప్రాసెసింగ్‌ రుసుము భారం పడుతుంది.

యూపీఐ ఆధారిత లావాదేవీలపై ఛార్జీలు (Phonepe UPI Transaction Charges) విధించడం ప్రారంభించిన మొదటి డిజిటల్‌ చెల్లింపుల సంస్థగా ఫోన్‌పే నిలవనుంది. పోటీ సంస్థలు ఈ లావాదేవీలపై ఛార్జి వసూలు చేయడం లేదు. ఇప్పటివరకు క్రెడిట్‌ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఫోన్‌పేతో పాటు ఇతర సంస్థలు కూడా ప్రాసెసింగ్‌ ఫీజులు (Phonepe Transaction Charges) వసూలు చేస్తున్నాయి. రూ.50 లోపు ఫోన్‌ రీఛార్జీలపై రుసుములు ఉండవని, రూ.50-100 రీఛార్జీలపై రూ.1, రూ.100 దాటితే రూ.2ను ప్రయోగాత్మకంగా వసూలు చేయనున్నట్లు ఫోన్‌పే అధికార ప్రతినిధి వెల్లడించారు.

  • థర్డ్‌ పార్టీ యాప్‌లలో అధిక లావాదేవీలను ఫోన్‌పే నిర్వహిస్తోంది. సెప్టెంబరులో 165 కోట్ల యూపీఐ లావాదేవీలను ఫోన్‌పే నిర్వహించి, ఈ విభాగంలో 40 శాతం వాటా పొందింది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details