కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులకు ఇచ్చే రెమిడెసివిర్ ఔషధం ధర తగ్గిస్తూ ఫార్మా సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఔషధం ధర తగ్గించాలని కేంద్రం పలు సార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది.
కాడిలా హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా లాంటి సంస్థలు రెమిడెసివిర్ బ్రాండ్లపై ధరలు తగ్గించినవాటిలో ఉన్నాయి. ధర తగ్గింపు నిర్ణయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్వాగతించారు. కరోనాపై పోరులో ఫార్మా కంపెనీలు కలిసి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు.