'కేఫ్ కాఫీ డే' వ్యవస్థాపకుడు, దివంగత సిద్ధార్థ రాసినట్లుగా పేర్కొంటున్న లేఖ పలు ఊహాగానాలకు కేంద్రంగా నిలుస్తోంది. ఈ లేఖలోని సంతకం సిద్ధార్థదేనా? లేక ఫోర్జరీ చేశారా? ఇంతకీ లేఖను అతనే టైప్ చేశారా? లేక మరెవరైనా రూపొందిస్తే దానిపై సంతకం చేశారా? అని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పలు ఊహాగానాలకు తావిచ్చిన ఈ లేఖను, అందులోని సంతకాన్ని ప్రముఖ ఫోరెన్సిక్ నిపుణుడు ఫణీంద్ర విశ్లేషించారు. ఆ విషయాలను ఈటీవీ భారత్తో పంచుకున్నారు. అవేంటో మీరే చూడండి.
'ఆ లేఖ' సిద్ధార్థ రాశారా? సంతకం ఆయనదేనా?
"వ్యక్తుల సంతకాలు కాలం గడుస్తున్న కొలది మారుతుంటాయి. వారి సంతకాల్లో తేడాలు రావడానికి చాలా కారణాలే ఉంటాయి. సిద్ధార్థ్ ఇంతకు మునుపు చేసిన సంతకాలతో, లేఖలోని సంతకాన్ని పోల్చి చూశాను. అయితే సిద్ధార్థ్ రాసినట్లుగా చెబుతున్న లేఖలో రెండు అక్షరాలు కనిపించడంలేదు. ఇదే అనుమానాలకు తావిస్తోంది. అయితే దీనితోనే ఓ నిర్ణయానికి రాలేము.
నా ఉద్దేశం ప్రకారం ఈ లేఖలో ఎలాంటి ఫోర్జరీ జరగలేదు. లేఖ టైప్ చేసి ఉంది. ఇలాంటి సందర్భాల్లో అంత చక్కగా వ్యాకరణాన్ని అనుసరించి వ్యక్తులు లేఖ రాయగలరా? అని పరిశీలిస్తాం. ఫోరెన్సిక్ లింగ్విస్టిక్ అనాలసిస్ చేస్తాం. అయితే సిద్ధార్థ ఈ లేఖ స్వయంగా రాశారా? మరెవరైనా టైప్ చేస్తే కింద సంతకం చేశారా? అనేది తెలుసుకోవాల్సి ఉంది."
- ఫణీంద్ర, ఫోరెన్సిక్ నిపుణుడు
ఇదీ చూడండి: సిద్ధార్థ సేవలు కొనియాడిన పారిశ్రామిక దిగ్గజాలు