తెలంగాణ

telangana

ETV Bharat / business

టీకాలు ఇచ్చేందుకు ఫైజర్​ రెడీ.. కానీ! - భారత్​లో ఫైజర్ సంస్థ ఒప్పందం

2021 చివరికల్లా భారత్​కు 5 కోట్ల కొవిడ్ టీకా డోసులు అందించేందుకు ఫైజర్​ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇందుకోసం నిబంధనలను సడలించాలని ఆ సంస్థ అభిప్రాయపడుతున్నట్టు సమాచారం. మరోవైపు ఈ ఏడాది భారత్​కు వ్యాక్సిన్లు పంపే సామర్థ్యం తమ వద్ద లేదని.. వచ్చే ఏడాది టీకాలు ఇవ్వగలమని మోడెర్నా చెప్పినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

vaccines
ఫైజర్, మోడెర్నా

By

Published : May 25, 2021, 9:56 PM IST

టీకాలు ఇచ్చేందుకు ఫైజర్​ రెడీ.. కానీ!

తమ సంస్థ నుంచి భారత్​కు.. వచ్చే ఏడాది సింగిల్​ డోస్​ టీకాను అందించవచ్చని మోడెర్నా అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. సిప్లాతో పాటు ఇతర దేశీయ సంస్థలతో ఇందుకు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తమ వద్ద సరఫరాకు సరిపడా టీకాలు లేవని భారత ప్రభుత్వానికి మోడెర్నా చెప్పిందని తెలుస్తోంది. మరో విదేశీ ఔషధ సంస్థ ఫైజర్​.. ఈ ఏడాదిలోనే 5 కోట్ల టీకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని.. కానీ నిబంధనల్లో ఉపశమనం కల్పించాలని అభిప్రాయపడుతున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి పేర్కొన్నాయి.

భారత్​లో రెండో దశ కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున.. టీకాల పంపిణీ కోసం ఇటీవలే ఉన్నత స్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఔషధ తయారీ సంస్థల ప్రకటనకు ప్రాధాన్యం సంతరించుకుంది.

జులైలో కోటి డోసులు..

తమ వద్ద సరఫరాకు సరిపడా టీకాలు లేవని మోడెర్నా తెలుపగా ఇతర దేశాలకు టీకాలు సరఫరా చేసే అవకాశాలు స్వల్పంగానే ఉన్నట్లు జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించినట్టు సమాచారం.

ఈ తరుణంలో ఫైజర్​ ప్రకటన మాత్రం భారత్​కు ఊరటనిచ్చింది. ఈ ఏడాదిలోనే 5 కోట్ల కొవిడ్ టీకా డోసులు పంపేందుకు సిద్ధమని ఫైజర్ తెలిపింది. జులైలో కోటి, ఆగస్టులో కోటి, సెప్టెంబర్​లో 2 కోట్లు, అక్టోబర్​లో కోటి డోసులు ఇవ్వగలమని వెల్లడించింది. ఈ మేరకు భారత ప్రభుత్వమే టీకా డోసులకు డబ్బులు చెల్లించాలని పేర్కొంది.

అయితే అంతర్జాతీయ సంస్థ కాబట్టి.. దానికి అనుమతులు ఇవ్వాలనుకున్నా.. ఫైజర్​ పెట్టిన నిబంధనలను అంగీకరిస్తే.. ఇతర సంస్థలు కూడా అదే బాటపట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:జూన్​లో​ అమెరికా-రష్యా అధ్యక్షుల భేటీ

ABOUT THE AUTHOR

...view details