ఆకాశాన్ని అంటిన ఇంధన ధరల భారం నుంచి కొంతమేర ఉపశమనం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. లీటరు పెట్రోల్‌పై సుమారు 3 రూపాయల వరకు ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.
"లీటరుకు పెట్రోల్‌పై రూ. 3 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా ప్రజలకు కొంతమేర ఉపశమనం కలగనుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.1,160 కోట్ల మేర భారం పడనుంది."
-పి. త్యాగరాజన్, తమిళనాడు ఆర్థిక మంత్రి
అయితే తగ్గించిన ఈ పెట్రోల్ ధరలు ద్విచక్ర వాహనదారులకు మాత్రమే వర్తిస్తాయని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది.
మే నుంచి ఇంధన ధరలు భారీగా పెరిగాయి. అన్ని మెట్రోనగరాల్లో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.49 ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 94.39గా ఉంది.
ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇంధన ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
- హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్ లీటర్ రూ.98.01 వద్ద ఉన్నాయి.
- గుంటూరులో లీటర్ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్ లీటర్ రూ.108.06గా ఉంది.
- వైజాగ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.
ఇదీ చదవండి:స్వల్పంగా తగ్గిన పసిడి ధర- ఏపీ, తెలంగాణలో ధరలు ఇలా..