తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహనదారులకు శుభవార్త: తగ్గిన పెట్రోల్​ ధరలు - హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ ధర

అంతర్జాతీయంగా చమురు ధరల్లో సానుకూలతల కారణంగా దేశీయంగా పెట్రోల్​, డీజిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దిల్లీలో లీటర్​ పెట్రోల్ ధర నేడు 5 నెలల కనిష్ఠానికి చేరింది. ఇతర ప్రధాన మెట్రో నగరాల్లో చమురు ధరలు వివరాలు

Petrol prices see big cut today
తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

By

Published : Feb 11, 2020, 1:22 PM IST

Updated : Feb 29, 2020, 11:37 PM IST

దేశ వ్యాప్తంగా పెట్రోల్​, డీజిల్​ ధరలు వరుసగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు సాధారణ స్థాయివద్ద కొనసాగుతున్న కారణంగా దేశయ చమురు సంస్థలు పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గిస్తున్నాయి. ప్రధాన మెట్రో నగరాల్లో నేడు లీటర్ పెట్రోల్​ ధర 16 నుంచి 17 పైసల వరకూ తగ్గింది. డీజిల్​ ధర లీటర్​కు 20-22 పైసలు క్షీణించింది. దిల్లీలో నేడు పెట్రోల్​ ధరలు 5 నెలల కనిష్ఠ స్థాయికి చేరడం గమనార్హం.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు

నగరం పెట్రోల్ డీజిల్ తగ్గుదల (పైసల్లో)
దిల్లీ రూ.71.94 రూ.64.88 16/20
హైదరాబాద్ రూ.76.41 రూ.70.62 17/22
ముంబయి రూ.77.57 రూ.67.94 15/21
కోల్​కతా రూ.74.54 రూ.67.15 16/20
బెంగళూరు రూ.74.35 రూ.67.03 16/21
చెన్నై రూ.74.69 రూ.68.47 17/21

కారణమిదే..

ప్రాణాంతక కరోనా వైరస్​ చైనాను వణికిస్తున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి ముడిచమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు ఏడాది కనిష్ఠ స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా పెట్రోల్​, డీజిల్ ధరలను... తగ్గిన ముడి చమురు ధరలకు అనుగుణంగా సవరిస్తున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.

ఇదీ చూడండి:చైనాలో ఫ్యాక్టరీలు కూత కూయట్లేదు

Last Updated : Feb 29, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details