తెలంగాణ

telangana

ETV Bharat / business

వాహనదారులకు షాక్- భగ్గుమన్న పెట్రోల్ ధరలు - లీటర్​ పెట్రోల్ ధర

వాహనదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు షాకిచ్చాయి. పెట్రోల్​, డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దిల్లీలో లీటర్ పెట్రోల్​ ధర రూ.87.60 దాటింది. ముంబయిలో పెట్రోల్ ధర లీటర్​కు ఏకంగా రూ.94 పైకి చేరింది.

petrol price hike again
మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

By

Published : Feb 10, 2021, 10:01 AM IST

పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భగ్గుమన్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర 30 పైసలు పెరిగి రూ.87.60 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్​కు 25 పైసలు పెరిగి రూ.77.77 వద్ద ఉంది.

దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధరలు 27-32 పైసల వరకు పెరిగాయి. డీజిల్ ధర 24-27 పైసల మధ్య పెరిగింది.

ప్రధాన నగరాల్లో ధరలు (లీటర్​కు)

నగరం పెట్రోల్ డీజిల్
హైదరాబాద్ రూ.91.07 రూ.84.77
బెంగళూరు రూ.90.51 రూ.82.38
చెన్నై రూ.89.95 రూ.82.88
ముంబయి రూ.94.12 రూ.84.63
కోల్​కతా రూ.88.90 రూ.81.30

ఇదీ చూడండి:మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగా భారత్‌!

ABOUT THE AUTHOR

...view details