దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్, డీజిల్ లీటరుపై 37 పైసల మేర పెరిగింది. శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.86.95 వద్దకు చేరింది. డీజిల్ ధర కూడా లీటర్‌కు రూ.77.13 వద్దకు చేరింది.
దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లోనూ పెట్రోల్ ధర లీటర్‌కు 26 పైసల నుంచి 32 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌పై 28 పైసల నుంచి 33 పైసల వరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.