చమురు ధరలను వరుసగా ఆరో రోజూ పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. అంతర్జాతీయంగా పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. దీంతో దిల్లీ సహా ఇతర మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 9 నుంచి 11 పైసల మేర పెరిగింది. ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి.
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
By
Published : Aug 20, 2020, 11:34 AM IST
వరుసగా ఆరో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 10 పైసల మేర ధర పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. దీంతో లీటర్ పెట్రోల్ ధర దిల్లీలో రూ.81.06 వద్దకు చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.73.62 వద్ద స్థిరంగా ఉంది.
అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర 45 డాలర్లు దాడింది. ఈ నేపథ్యంలో గత ఐదు రోజుల్లో పెట్రోల్ ధర 57 పైసలు పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు.
ఇతర మెట్రో నగరాల్లోనూ 9 నుంచి 11 పైసల మేర పెట్రోల్ ధర పెరిగింది. డీజిల్ ధరలు మాత్రం గత రెండు వారాలుగా స్థిరంగా ఉన్నాయి.