తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎట్టకేలకు పెట్రో బాదుడుకు బ్రేకులు - Petrol Rates in India

దేశంలో వరుసగా 12 రోజులపాటు పెరిగిన పెట్రోల్​ ధరలు ఆదివారం స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధానిలో లీటరు పెట్రోల్​ ధర రూ. 90.58, డీజిల్​ లీటరు రూ. 80.97గా ఉంది.

Petrol prices constant today
12 రోజుల తర్వాత శాంతించిన చమురు ధరలు

By

Published : Feb 21, 2021, 8:56 AM IST

దేశవ్యాప్తంగా ఆదివారం చమురు ధరలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలోనే 14 సార్లు పెరిగిన ధరలు.. వరుసగా 12రోజులపాటు(ఈనెల 20వరకు) అంతకంతకూ వృద్ధి చెందాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు 24 సార్లు పెరిగిన చమురు ధరలు.. మొత్తంగా రూ.7.50 వృద్ధి చెందాయి.

అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్​ ముడి చమురు ధరల్లో మార్పులు, డాలురుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గుల వల్లే ఇంధన రేట్లు పెరిగాయి. ప్రస్తుతం.. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ. 90.58గానూ.. లీటరు డీజిల్​ రేటు రూ. 80.97గా ఉంది. ఇతర ప్రధాన నగరాల్లో లీటర్​ పెట్రోల్​ ధర రూ.90పైనే కొనసాగుతోంది.

ఇదీ చదవండి:'ధరలు తగ్గించాలని తప్ప మరేం చెప్పలేం'

ABOUT THE AUTHOR

...view details